10-01-2026 01:14:22 AM
రోడ్డు భద్రత అవగాహన ర్యాలీలో జిల్లా కలెక్టర్ బెదావత్ సంతోష్, ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి
నాగర్ కర్నూల్, జనవరి 9 (విజయక్రాంతి): ప్రతి ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించడం వల్ల తన ప్రాణాన్ని రక్షించుకోవడంతోపాటు ఆ కుటుంబం సమస్త మానవాళికి కూడా రక్షణ కవచంగా నిలబడుతుందని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డిలు అన్నారు. శుక్రవారం జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో సందర్భంగా ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీలో హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనంపై ర్యాలీ చేపట్టారు.
వారితోపాటు అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసులు, డిటిఓ బాలు నాయక్ హాజరయ్యారు. 217 కుటుంబాలకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వందమంది సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని జెడ్పీ మైదానంలో రెండవ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ తో కలిసి కాగడ ప్రదర్శనతో క్రీడాకారులను విద్యార్థులను ఉత్సాహపరిచారు.