10-01-2026 01:11:34 AM
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్
కల్వకుర్తి, జనవరి 9: నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అమాయకులే ప్రాణాలు కోల్పోతున్నారని కల్వకుర్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. ప్రతి వాహనదారుడు రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తే సురక్షితంగా గమ్యాన్ని చేరవచ్చని తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ఎంజెపి బాలికల పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
హెల్మెట్ వినియోగం, సీట్బెల్ట్ ధరించడం, వేగ నియంత్రణ, ట్రాఫిక్ సూచికల పాటింపు వంటి అంశాలపై విద్యార్థులకు వివరించారు. నేర్చుకున్న రోడ్డు భద్రతా అంశాలను తమ కుటుంబ సభ్యులతో పంచుకొని, కుటుంబమంతా క్షేమంగా ఉండేలా విద్యార్థులు తమ వంతు సహకారం అందించాలని సూచించారు.