18 April, 2026 | 11:37 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

రూ.7 కోట్లతో సాకి చెరువు అభివృద్ధి

21-06-2025 12:41 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డ్డి

పటాన్‌చెరు, జూన్ 20: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువును ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేస్తున్నామని  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం చెరువులో గుర్రపుడెక్క తొలగింపు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 7 కోట్లతో చెరువు సుందరీకరణ పనులు చేపడుతున్నామని తెలిపారు.

పటాన్ చెరు పట్టణ ప్రజల కోసం చెరువును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తదితరులుపాల్గొన్నారు.

నేడు పటాన్‌చెరులో యోగా డే వేడుకలు..

అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి యోగా ప్రాముఖ్యత తెలియజేయాలన్న సమున్నత లక్ష్యంతో  శనివారం పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో యోగ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం మైత్రి మైదానంలో యోగా డే వేడుకల ఏర్పాట్లు ఆయన పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచమంతా పరిపూర్ణ ఆరోగ్యంతో విశ్వశాంతితో ముందుకు సాగాలన్నదే యోగ దినోత్సవ ఉద్దేశమని తెలిపారు. విశ్వవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు యోగ విశిష్టతను తెలుసుకొని ప్రతిరోజు యోగ సాధన చేస్తున్నారని తెలిపారు. శనివారం ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మది గంటల వరకు యోగ వేడుకలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరుకావాలని కోరారు.