calender_icon.png 20 July, 2025 | 7:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూరాలలో కృష్ణమ్మ పరవళ్లు

21-06-2025 12:42:30 AM

  1. ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత
  2. ఇన్‌ఫ్లో 84 వేలు, ఔట్‌ఫ్లో 91 వేల క్యూసెక్కులు

వనపర్తి, జూన్ 20 (విజయక్రాం తి): కృష్ణానదికి ఎగువన కురుస్తున్న వర్షాలతో కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి 84 వేల క్యూసె క్కుల జలాలు దిగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు చేరుతున్నాయి. ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన అధికారులు జూరాల పది గేట్లు ఎత్తి 91,944 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.682 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు వివరించారు.