13-12-2025 12:00:00 AM
ఎర్రవల్లి మండలంలో బీఆర్‌ఎస్ మద్దతుదారుల తరఫున ప్రచారం
అలంపూర్, డిసెంబర్ 12: బీఆర్‌ఎస్ హయాంలోనే పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ,ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు.శుక్రవారం ఎర్రవల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఆయన బిఆర్‌ఎస్ మద్దతుదారుల తరఫున ఎన్నికల ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ...
ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారుకు ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కెసిఆర్ హయాంలో పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు తెలిపారు.గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించే అనిత కృష్ణసాగర్ బిఆర్‌ఎస్ పార్టీ తరపున బరిలో ఉన్నారని ప్రజలు ఆశీర్వదించి వారిని మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు