25 May, 2026 | 1:57 PM

జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్

25-05-2026 01:08 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని జొన్నల కొనుగోలు కేంద్రాన్ని సోమవారం మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణ సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే పంపించడం జరుగుతుందని రైతులు ఆందోళన వద్దన్నారు. మార్కెట్ లో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మధ్య దళారీల నమ్మవద్దని కొంతమంది మధ్య దళారీలు జొన్నలు రైతుల పేరుతో విక్రయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అక్రమ వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని సూచించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జుంగాల భోజన్న మునేశ్వర్ సోమన్న కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గాజుల పోతన్న సీనియర్ నాయకులు గుడాల శేఖర్ లు ఉన్నారు. కాగా నూతనంగా బాధ్యతలు చేపట్టి జొన్నల మార్కెట్ కు వచ్చిన చైర్మన్ ను గ్రామ సర్పంచ్ బిందుజా సుధీర్ రెడ్డి సన్మానించారు.