10 March, 2026 | 8:36 AM

ఆరోగ్య తెలంగాణతోనే అభివృద్ధి సాధ్యం

09-03-2026 08:01 PM

తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు రా సత్యం

ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణలో పౌరులు ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఖానాపూర్ 11వ వార్డు కౌన్సిలర్, తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం అన్నారు. సోమవారం పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పట్టణంలో ఫైవ్ కే రన్ నిర్వహించారు.

మున్సిపాలిటీ తరఫున నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి కొమరం భీమ్ చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, వైద్యులు కిరణ్ కుమార్, మైనారిటీ పట్టణ అధ్యక్షులు షౌకత్ పాషా, రాజు యాదవ్, బాశెట్టి శివ, అశోక్ ,లో పాల్గొన్నారు.