13-02-2026 12:00:00 AM
రూ. 50 కోట్లతో అచ్చంపేటలో మూడో ఆక్వా కల్చర్ కేంద్రం .
చంద్ర సాగర్ వద్ద అధునాతన టెక్నాలజీతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం కు రూ. 50 లక్షలు
పండుగ సాయన్న స్ఫూర్తితో ముందుకు
రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి.
అచ్చంపేట ఎమ్మెల్యేతో కలిసి అభివృద్ధి పనులకు శ్రీకారం
అచ్చంపేట ఫిబ్రవరి 12: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలోని ముదిరాజులకు సము చిత స్థానం లభించిందని దానికి తానే ప్రత్య క్ష ఉదాహరణ అని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకు గానే చూ శాయని ఆక్షేపించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గురువారం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి పర్యటించారు. అచ్చంపేటలోనీ శనగకుంట వద్ద రూ. 1.78 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
పట్టణంలోని పలు వా ర్డులో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టా రు. అనంతరం అచ్చంపేట మండలం చం దాపూర్ సమీపంలోని చంద్ర సాగర్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. అచ్చంపేట ప్రాంతంలో రాష్ట్రంలోనే మూడో ఆక్వా కల్చర్ సెంటర్ నిర్మాణం కోసం రూ. 50 కోట్లు మంజూరు చేస్తున్నానని మంత్రి ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రంలోని పాలకులు ముదిరాజుల సంఖ్య ఎక్కువగా ఉందని కాకి లెక్కలు చెప్పుకుంటూ వచ్చారు.. దానిని ని జం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి జనగణన చేపట్టిన తర్వాత ముదిరాజుల ప్రాధాన్యతను వా రి ఆర్థిక స్థితిగతులను మరింత మెరుగుపరిచేలా ముదిరాజు బిడ్డకు సముచిత స్థానం కల్పించారని అందుకు సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి పదవి ఇచ్చిన ఏకైక సీఎం
గత పాలకులు ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించారని మంత్రి ధ్వజమెత్తారు. జనాభాలో అధిక భాగంగా ఉన్నా సముచిత స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ము దిరాజులకు మంత్రి పదవి తోపాటు అన్ని శాఖలతో పాటు ముదిరాజ్ శాఖ కూడా చైర్మన్ పదవి ఇచ్చింది ఏకైక సీఎం అని కొనియాడారు. మన స్థితిగతులు మార్చేందుకు ప్రభుత్వము తరపున బిడ్డగా నేనున్నానని అందుకు మన పిల్లలను ఉన్నత విద్యకు చదివించేందుకు అన్ని శాఖల సహకారాలు అం దజేస్తానని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదివించి.. ఆర్థిక వృద్ధి పొం దేందుకు పని చేయాలని సూచించారు.
రాష్ట్రంలో మూడో అతిపెద్ద ఆక్వా కల్చర్ సెం టర్ ను అచ్చంపేట ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే కావలసిన స్థలాన్ని దాదాపు 100 ఎకరాల స్థలం కేటాయిస్తామన్నారు. చంద్ర సాగర్ వద్ద ప్రస్తుత నూతన టెక్నాలజీతో రూ. 50 లక్షలతో చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని అన్ని హంగులతో ఏర్పాటు చేసేందుకు ఇక్కడి నుంచి మంజూ రు చేస్తున్నానని మత్స్యకారులకు హామీ ఇచ్చారు. వైయస్సార్ పార్కుకు మరో రెండు కోట్లు, మినీ స్టేడియంకి నిధులు, అచ్చంపేట పాల ఉత్పత్తి కేంద్రానికి మరో 30 వేల లీటర్ల చిల్లింగ్ చేసే యంత్రాన్ని మంజూరు చేస్తున్నానని రానున్న బడ్జెట్లో రూ. 2-3 వేల కోట్లు కేటాయించేలా కసరత్తు చేస్తున్నామన్నారు.
ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన భయపడను
తనపై ఎన్ని కుట్రలు చేసినా భయపడనని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ డిండి ప్రాజెక్టులో అచ్చంపేట నియోజకవర్గంలోని మత్స్యకారులకు అధిక ప్రాధానత ఇవ్వాలని మంత్రిని కోరారు. నియోజకవర్గంలో అభివృద్ధి పరులకు అధిక నిధులు కేటాయించాలని అభ్య ర్థించారు. ఆయాచోట్ల నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేందర్, మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసులు, కమిషనర్ మురళి, మేనేజర్ రమేష్ నాయక్ ఏ ఈ రాజ్యా నాయక్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత మల్లేష్, వివిధ శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.