17 April, 2026 | 10:26 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

05-06-2025 12:00 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, జూన్ 4 (విజయక్రాంతి): జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం తన చాంబర్‌లో జిల్లా పంచాయతీరాజ్, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, జిల్లా పరిషత్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద మం జూరై కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లాలోని స్వంత భవనాలు లేని గ్రామపంచాయతీ కార్యాలయాలు, పురోగతిలో ఉన్న గ్రామపంచాయతీ కార్యాలయాల భవనాల నిర్మాణ పనులు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపుల వివరాలు తెలుసుకొని పలు సూ చనలు చేశారు.

నిర్మాణ దశలు పూర్తి అయి న మేరకు బిల్లులు సమర్పించాలని తెలిపారు. భవన నిర్మాణానికి భూమి గుర్తించని ప్రాంతాలలో త్వరగా ప్రక్రియ పూర్తి చేయాలని, షెడ్యూల్ తెగల జనాభా అధికంగా ఉన్న అటవీ ప్రాంతాలో భూమి అందుబాటులో లేనట్లయితే అటవీ భూమి అవసర మైన మేరకు ప్రతిపాదనలు సిద్దం చేసి సమర్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పం చాయతీరాజ్ ఇంజనీర్ రామ్ మోహన్ రా వు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి గణపతి, ఎ.ఈ.ఈ. లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.