డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టాలి
09-06-2024 02:22 AM
కూకట్‌పల్లి జోనల్ కమిషనర్‌కు ఎమ్మెల్యే గాంధీ విజ్ఞప్తి
కూకట్‌పల్లి, జూన్ 8: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై శనివారం కూక ట్‌పల్లి జోనల్ కమిషనర్ అభిలాష అభినవను ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ జోనల్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, అదే విధంగా పెండింగ్‌లో ఉన్నవాటిని ప్రారంభించి త్వరగా పూర్తయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చూడా లని అన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






