14 July, 2026 | 11:19 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

డివిజన్లను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం

09-06-2024 02:24 AM

పీర్జాదిగూడ మేయర్ వెంకట్ రెడ్డి

మేడిపల్లి, జూన్ 8: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మేయర్ జక్క వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం 9వ డివిజన్ కార్పొరేటర్ బచ్చ రాజుతో కలిసి మల్లికార్జున నగర్, రాఘవేంద్ర కాలనీలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణం సరిగా లేదని, మంచినీటి సరఫరాకు పాత పైప్‌లైన్ ఉండడం వల్ల నిత్యం నీరు లీకేజీ అవుతోందని కాలనీ వాసులు వాపోయారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. 9వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 40 లక్షల లీటర్ల సామర్థ్యంగల ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కౌడే పోచయ్య, పార్టీ అధ్యక్షుడు బండారి రవీందర్, ఏనుగు మనోరంజన్ రెడ్డి, చిర్ర సంతోశ్, సత్యం, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.