అట్టహాసంగా అభివృద్ధి పనులకు శ్రీకారం
- అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి
- వీఐపీలకు మాత్రమే ఆలయంలోనికి అనుమతి
- సీఎంకు స్వాగతం పలికిన జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు
- ప్రశాంతంగా ముగిసిన సీఎం పర్యటన
నిర్మల్, ఏప్రిల్ ౬(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో రూ.225 కోట్లతో చేపట్టే ఆలయ పునర్నిర్మాణ పనులు, ముధోల్ మండల కేంద్రంలో రూ.200 చేపట్టి ఇంటిగ్రేటెడ్ పాఠశాల అభివృద్ధి పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులతో కలిసి ప్రారంభించారు. ఉదయం 11:30 బాసరకు ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో రాగా మరో హెలికాప్టర్‌లో రాష్ట్ర మంత్రులు భట్టి విక్రమార్క, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, వేం నరేందర్ రెడ్డి తదితరులు వచ్చారు. బాసర ఆలయానికి చేరుకొని ఆలయ మండపంలో సీఎం రేవంత్ రెడ్డి మనుమడుకి అక్షరా భ్యాసాన్ని చేయించారు.
అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కాళికామాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంను జిల్లాకు చెందిన ప్రజాప్రతితులు అధికారులు సన్మానం చేశారు. బాసరపు ఆలయ పునర్నిర్మాణ నమూనా చిత్రం అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం అక్కడే భోజనం చేసి అదిలాబాద్ పర్యటనకు తరలి వెళ్లారు. అంతకుముందు జిల్లాకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఉప సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర మంత్రులకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఎస్పీ జానకి షర్మిల ఎమ్మెల్యేలు బుజ్జి పటేల్ రామారావు పటేల్ స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎంపీ నాగేష్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్ మహేశ్వర్ రెడ్డి వెడుమ బొజ్జు పటేల్, మాజీ మంత్రులు వేణుగోపాల చారి ఏ ఇంద్రకన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్ విట్టల్ రెడ్డి రేఖా శ్యాం నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య గణిత చక్రవర్తి దత్తాత్రి, దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు కార్యదర్శి శైలజ రామయ్య తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులకు ఘనంగా సన్మానం చేశారు
పోలీసుల నిర్బంధం
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బాసరలో ఎస్పీ జానకి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన ఆలయంతో పాటు గోదావరి పుష్కర ఘాట్లు ప్రధాన రోడ్లు గెస్ట్ హౌస్లు ఆలయ ప్రాం గణం మొత్తం పోలీసులతో నిండిపోయింది. ఆలయంలోనికి వీఐపీలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆలయం వరకు బస్సులను నిషేధించారు. డోన్ కెమెరాలతో బందోబస్తు పర్యవేక్షణ చేశారు. మీడియా సైతం లోనికి అనుమతించలేదు. కొందరు విఐపిలకు ముఖ్యమంత్రిని కలుసుకున్నందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడం వారు నిరాశతో వెనుతిరిగారు. సీఎం పర్యటన ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపించుకున్నారు.




