7 April, 2026 | 2:19 AM

వచ్చే నెలలో హీరపూర్‌కు సీఎం రాక

07-04-2026 12:00 AM

పిప్రి ప్రజాపాలన సభలో మాజీ ఎంపీ సోయం బాపూరావు 

ఉట్నూర్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రానున్న మే నెలలో ఇంద్రవెల్లి మండలం హీరాపూర్‌లో పర్యటిచనున్నట్లు సమాచారం. 2020 ఏప్రిల్ 20న అప్పుడు ఎంపీ హోదాలో రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి అమర వీరులకు  నివాళులు అర్పించిన అనంతరం హీరాపూర్ గ్రామాన్ని పర్యటించారు.

మరోసారి తప్పకుండా హీరాపూర్ గ్రామానికి వచ్చి, గిరిజనుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానికి కృషి చేస్తానని ఆరోజు హామీ ఇచ్చారు. ఆదివాసీ మహిళలతో కలిసి భోజనం చేశారు. 2020 ఏప్రిల్ 20న హీరాపూర్ గ్రామాన్ని సందర్శించిన విషయాన్ని సోమవారం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన.. బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మాజీ ఎంపీ సోయం బాపురావును పిలిచి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాక అధ్యక్షుడిగా, ఎంపీ గా 2020 ఏప్రిల్ 20న సందర్శించిన హీరాపూర్ గ్రామానికి వచ్చేనెల స్వయంగా అక్కడికి వస్తానని చెప్పినట్లు మాజీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు.

హీరాపూర్, వడగావ్  పంచాయతీలతో పాటు  ఇంద్రవెల్లి మారుమూల గ్రామాల సమస్యలను తెలుసుకునేం దుకు జిల్లా అధికారుల బృందాన్ని పంపించి, పూర్తి వివరాలు సేకరిస్తానని, హీరాపూర్ ను సందర్శించే ముందు మండల సమస్యలను గుర్తించి వాటి మంజూరు చేస్తానని సీఎం తనతో స్వయంగా చెప్పారని, మే నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఉంటుదని మాజీ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు.