5 August, 2026 | 2:29 PM

నివేదన ఆలస్యం.. భక్తుల ఆగ్రహం

23-08-2024 03:55 PM

రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి అపచారం జరిగింది. ప్రతిరోజు ఉదయం 11:30 గంటలకు జరగాల్సిన నివేదన అరగంట ఆలస్యమైంది. వంట చేయాల్సిన వంట బ్రాహ్మణుడు ఆలస్యంగా వంట చేశాడని స్థానికులు ఆరోపించారు. డ్యూటీ సమయంలో తాగి విధులు నిర్వర్తించారని భక్తులు ఆరోపించారు. నివేదన వంటకాలు తయారు చేయడంలో ఆలస్యం కావడంతో భక్తులు క్యూలైన్లో నిలుచోని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న ఆలయంలో అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఇలాంటి సంఘటనలు జరగడం పలు విమర్శలకు తావిస్తోంది. నివేదన ఆలస్యం పై విచారణ చేపడతామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.