బూటకపు నాటకాల ధర్నాలు ఎన్ని చేసినా రైతులు బీఆర్ఎస్ నాయకులను నమ్మరు
అన్నదాతలకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నాం
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు
కోరుట్ల: అన్నదాతలకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేస్తున్నామని, బూటకపు నాటకాల ధర్నాలు ఎన్ని చేసినా బీఆర్ఎస్ పార్టీ నాయకుల రైతులు నమ్మరని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. కోరుట్ల పట్టణంలోని జువ్వాడి భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గ కేంద్రంలో కోరుట్లలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రైతులతో ధర్నా చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదేళ్ల పాలన లో రైతులకు రుణమాఫీ చేశారా? రుణమాఫీ అయిన వ్యక్తులు ధర్నాలో కూర్చోవడం ఏంటని ప్రశ్నించారు. మీకు అయిన రుణమాఫీని తిరిగి వెంటనే ప్రభుత్వానికి సరెండర్ చేయాలని,రుణమాఫీ అయిన వ్యక్తులను ధర్నాలో కూర్చున్న దానిపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సాంకేతిక లోపాలతో కొన్ని బ్యాంకుల్లో పూర్తి కాలేదని అన్నారు. గత పదేళ్ల పాలనలో రైతులకు ఏం చేశారో చెప్పాలని, నడుస్తున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసి వేయించిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు కేవలం మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను రైతులను పక్కదోవ పట్టించడం కోసం ఇలాంటి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుంటే అది చూచి జీర్ణించుకోలేక ఇలాంటి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కల్లూరు గ్రామానికి చెందిన వనతడుపుల అంజయ్య, మాదాపూర్ మాజీ సర్పంచ్,జోగినిపెల్లి మాజీ సర్పంచ్, చిన్నమెట్ పల్లి మాజీ సర్పంచ్ తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు రుణమాఫీ అయ్యిందని అన్నారు. అలాంటి వ్యక్తులు ధర్నా లో కూర్చోవడం ఏంటీ? అయిన రుణమాఫీ తిరిగి ప్రభుత్వానికి సరెండర్ చేస్తారా?అని ప్రశ్నించారు.
ధర్నాలో రుణమాఫీ అయినా నాయకులను కూర్చోబెట్టుకోవటం ఏంటని దీనికి ఎమ్మెల్యే సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో మీరు చేస్తామన్న రైతు రుణమాఫీ ఎంత మందికి చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడమే కాకుండా పేద ప్రజల సంక్షేమం కోసం 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో కొన్ని బ్యాంకుల్లో రుణమాఫీ కాలేదని అవి కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో మీకంటే మెరుగ్గానే విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి సభ్యులు గంగాధర్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు వసీం, పట్టణ ప్రధాన కార్యదర్శి నజ్జు, కార్యదర్శి మ్యాకల నర్సయ్య, బన్న రాజేష్ , సహాయ కార్యదర్శి ఎంబెరి సత్యనారాయణ, అజయ్, చిట్యాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ సంఘ లింగం, సోగ్రాభి, కటుకం దివాకర్, రాకేష్, రషీద్, పసుల కృష్ణ ప్రసాద్, మధు, నేతి శ్రీనివాస్, కరిపెల్లి అజయ్, క్యాస సంజీవ్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






