మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వండి
వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
హనుమకొండ: మహిళలు, చిన్నారుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశంలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన పోలీస్ అధికారులతో వరంగల్ పోలీస్ కమిషనర్ శుక్రవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసిపిలు, అదనపు డిసిపిలు, ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా జోన్లవారిగా పెండిరగ్ కేసులు, కేసు ప్రస్తుత స్థితిగతులు, కేసుల్లోని నిందితుల అరెస్టుకు గల జాప్యం మొదలైన వాటిపై పోలీస్ కమిషనర్ సంబంధిత స్టేషన్ అధికారులను అడిగితెలుసుకున్నారు.
వీటితో పాటు సమీక్షలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించిన కేసులు, ఫోక్సో, గంజాయి, సైబర్, దొంగతనాలు, రొడ్డు ప్రమాదాలు, ఎస్.సి.ఎస్టీ కేసులపై పోలీస్ కమిషనర్ సమీక్షా జరిపారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... నేరాల నియంత్రణకై ఉన్నతాధికారులు సైతం రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తు క్రింది స్థాయి సిబ్బంది పనితీరు పర్యవేక్షించాలని ప్రధానంగా మహిళలు, పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై కఠినమైన సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసి, వారికి తప్పకుండా శిక్షలు పడేవిధంగా అధికారులు నైపుణ్యంతొ దర్యాప్తు చేపట్టాలని, యువత తాత్కాలిక జల్సాల కొసం తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారని, తద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. కావున స్టేషన్ అధికారులు స్టేషన్ పరిధిలో యువతకు దిశా నిర్ధేశం చేసేందుకు చోర చూపాలని. స్టేషన్ అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ, వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ బాధితులకు న్యాయం చేయాల్సి బాధ్యత మనపై వుందని.
నేరాల నియంత్రణకై విజుబుల్ పోలీసింగ్‌లో భాగంగా నిరంతరం పోలీస్ పెట్రోలింగ్ చేపట్టాలని, ముఖ్యంగా నేరాల కట్టడి కోసం సిసి కెమెరాల ఏర్పాటు పోలీస్ అధికారులు ప్రజలను ప్రోత్సహించాల్సి వుంటుందని. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు కూడా అధికారులు ప్రత్యేక చోరవ చూపడంతో పాటు, ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో తగు ముందస్తూ జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ట్రై సిటి పరిధిలో ట్రిపుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, అతి వేగంగా నడపడం, మైనర్ డ్రైవింగ్ కట్టడి చేయాలని, ఇందుకోసం ట్రాఫిక్ పోలీస్ అధికారులు ప్రత్యేక ప్రణాళికను రూపొందించుకోవాల్సి వుంటుందని. సన్నిహిత నుండి ప్రతి ఫిర్యాదును స్టేషన్ అధికారులు క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేపట్టిన తగిన నివేదిక అందించాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సెంట్రల్, వెస్ట్‌జోన్ డిసిపిలు షేక్ సలీమా, రాజమహేంద్ర నాయక్, అదనపు డిసిపిలు, రవి, సురేష్‌కుమార్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు పాల్గోన్నారు.






