15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

భక్త జనసంద్రం మల్లన్న క్షేత్రం

09-02-2026 12:31 AM

నాలుగో ఆదివారం పోటెత్తిన భక్తులు

కొమురవెల్లి, ఫిబ్రవరి 8: ప్రముఖ పుణ్యక్షేత్రమైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మో త్సవాల్లో భాగంగా నాలుగో ఆదివారం కూడా భక్తులు పోటెత్తారు. శనివారం సాయంత్రం నుంచే భక్తుల రాక మొదలు కాగా ఆదివారం తెల్లవారుజాము వరకు మల్లన్న సన్నిధానికి చేరుకున్నారు.

భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి, గర్భగుడిలో ఉన్న మూలవిరాట్‌ను దర్శించుకోవడానికి బారులు తీరారు. పట్నాలు వేసి, బోనాలు చెల్లించి, అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామి వారిని వేడుకున్నారు. గుట్టపైనున్న ఎల్లమ్మ తల్లికి బోనాలు ఎత్తుకొని బయలుదేరి వెళ్లి అమ్మవారికి నివేదించి, ఓడిబియాలు సమర్పించారు. భక్తితో వేడుకున్నారు. స్వామివారి దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది.