17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

అడ్డదిడ్డంగా నడుస్తున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా

09-02-2026 12:31 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): రోడ్డు ర వాణా నిబంధనలను పాటించకుండా, అడ్డదిడ్డంగా రోడ్లపై తి రుగుతున్న వాహనాలను కట్టడి చేయడానికి రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. వాణిజ్య, ప్యాసింజర్ వాహనాలు నిర్దేశిత ప్రయాణికులను మాత్రమే తీసుకెళ్లాలని, అలాగే వాణిజ్య వా హనాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను తరలిస్తే రోడ్ ట్రాన్స్పోర్ట్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారులు స్ప ష్టం చేస్తున్నారు.

ఇందులో భాగంగా శనివారం మహబూబాబాద్ పట్టణంలోని కురవి రోడ్డు మార్గంలో నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది ప్రయాణికులతో వెళుతున్న ప్యా సింజర్ ఆటో ను రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. ప్ర భుత్వ నిబంధనలను ఉల్లంఘించి సమర్థ్యానికి మించి ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుని అతి ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న ఆటోను రవాణా శాఖ అధికారులు గుర్తించి వెంటనే వాహనాన్ని సీజ్ చేసి సంబంధిత వాహనదారుడుపై కేసు న మోదు చేయడం జరిగింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్, ఎస్పీ, సంబంధిత రవాణా శాఖ అధికారులు ప్రయాణికులు, ప్రజల రక్షణ సౌకర్యార్థం ప్రత్యేక రోడ్డు భద్రత మాస ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, హెల్మెట్, సీట్ బెల్ట్ లేని ప్రయాణం సురక్షితం కాదని,

ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ట్రాఫిక్ రూల్స్ నిబంధనలను పాటించాలని త ద్వారా అందరికీ శ్రేయస్కారంగా ఉంటుందనే అంశంపై విద్యాసంస్థలు బహిరంగ ప్రదేశాలలో కార్యక్రమాలను నిర్వ హించడం జరుగుతుందన్నారు. రోడ్డు రవాణా నిబంధనలను పాటించడం వల్ల ప్రమాదాలను నిరోధించవచ్చని, సురక్షితమైన ప్రయాణం సాగించవచ్చని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు.