3 April, 2026 | 2:10 AM

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

03-04-2026 12:26 AM
  1. కన్నుల పండుగగా స్వామివారి చిన్న జయంతి ఉత్సవాలు

అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే సత్యం

జగిత్యాల, ఏప్రిల్ 2 ( విజయక్రాంతి ) :జగిత్యాల జిల్లా లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం లో స్వామివారి చిన్న జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. మూడు రోజులపాటు నిర్వ హిస్తున్న ఈ ఉత్సవాల్లో రెండవ రోజు అ యిన గురువారం భక్తుల రద్దీ ఉధృతంగా కనిపించింది.

తెల్లవారుజామునే వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారి దర్శనం కోసం దీర్ఘ క్యూలలో నిలబ డ్డారు.జయంతి సందర్భంగా స్వామివారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు ఘనం గా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు అర్పించి, పూలతో పాటు పండ్లతో అద్భుతంగా అలంకరించారు.

గురువారం స్వామి వారి చిన్నజయంతి నీ పురస్కరించుకొని భక్తులతో కిక్కిరిసిపోయింది,ఆలయ ప్రాంగణం మొత్తం కాషా య వర్ణంతో కళకళలాడుతూ భక్తి పరవశాన్ని కలిగించింది.రామనామ స్మరణతో కొండగట్టు మారుమోగింది.

జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో కొండ ప్రాంతమం తా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. హ నుమాన్ దీక్ష చేపట్టిన భక్తులు పెద్ద సంఖ్య లో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కొందరు భక్తులు పాదయా త్రగా కొండకు చేరుకొని తమ భక్తిని చాటుకున్నారు.రాష్ట్రం నలుమూలల నుంచి మా త్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వచ్చారు.

భక్తులకు అన్ని రకాల సౌకర్యలు

భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. తాగునీరు, ప్ర సాదం పంపిణీ, క్యూ లైన్లు, భద్రతా చర్యలు వంటి అంశాలలో ప్రత్యేక దృష్టి సారించా రు. జిల్లా కలెక్టర్, ఎస్ పి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కెమెరాల పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సం ఘటన లు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే

అంజన్న చిన్న జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి, పూజ అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు అందజేశారు.