3 April, 2026 | 2:11 AM

ఖానాపూర్ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ కిడ్నాప్

03-04-2026 12:27 AM
  1. పోలీసులకు బీఆర్‌ఎస్ నాయకుల ఫిర్యాదు
  2. రేపు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక

ఖానాపూర్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): గత నెల రోజులుగా వాయిదా పడుతూ వ స్తున్న ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారుతున్నది. ఇప్పటికీ రెండుసార్లు ఎన్నికకు అధికారులు ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్ కౌన్సిలర్లు మాత్రమే హాజరై, ప్రమాణస్వీకారం చేశారు. 12 వార్డులకు గాను మూడు పార్టీలకు నలుగురు చొప్పున సమాన బలం ఉన్నందువల్ల ఈ ఎన్నిక వాయిదా పడుతూ వస్తున్నది.

ఈ నేపథ్యంలో అధికారులు ఈ నెల 4న ఎన్నిక నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నా రు. ఈ తరుణంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ మే సా పోషమ్మ, ఆమె కుమారుడు సతీష్‌తో పాటు బీఆర్‌ఎస్ క్యాంపు నుంచి కిడ్నాప్ అ య్యాడని ఆరోపిస్తూ గురువారం ఖానాపూ ర్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్‌ఎస్ నేతలు  ఫి ర్యాదు చేశారు. కాంగ్రెస్సే కారణమంటూ ఆ రోపించారు.

తమకు నాలుగు సీట్లు ప్రజలు తీర్పు ఇచ్చారని, ఇలాంటి రాజకీయాలతో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుందని, తాము అడ్డుకుంటామని ఆ పార్టీ మా జీ జెడ్పిటిసి రాథోడ్ రాము నాయక్ అన్నా రు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్‌ఎస్ నేత లు సకారం శ్రీనివాస్, గౌడికర్‌రాజు, సుమ న్,వసంత్, తోట సుమిత్, దివాకర్, శ్రావణ్ ఉన్నారు.