26-08-2024 04:12:10 AM
మెదక్, ఆగస్టు 25(విజయక్రాంతి): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చికి ఆదివారం భక్తులు పోటెత్తారు. శనివారం సాయంత్రం వరకు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు చర్చికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం 4.30 గంటలకు ప్రత్యేక ప్రార్థనలను ప్రారంభమయ్యాయి. చర్చి పాస్టర్లు భక్తులకు క్రీస్తు సంకీర్తనలను వినిపించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.