calender_icon.png 18 January, 2026 | 9:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

జాతీయ ప్రతిభా పురస్కారానికి దేవులపల్లి రమేశ్ ఎంపిక

18-01-2026 07:20:41 PM

నంగునూరు: మండల కేంద్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత అతిథి ఉపాధ్యాయుడు దేవులపల్లి రమేశ్ జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆయన చేస్తున్న సృజనాత్మక కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించారు. శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ నెల 21న  విజయవాడలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో జరిగే 'సాహితీ సాంస్కృతిక పట్టాభిషేక మహోత్సవం'లో రమేశ్ ఈ అవార్డును అందుకోనున్నారు. జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికైన  రమేశ్‌ను పలువురు సాహితీవేత్తలు, మిత్రులు అభినందించారు.