18-01-2026 07:16:46 PM
బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్
బీసీ ఐక్య వేదిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
జవహర్ నగర్,(విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జవహర్ నగర్ డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర జవహర్ నగర్ బీసీల ఐక్యవేదిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ సంఘ అధ్యక్షుడు మారోజు సోమాచారి అధ్యక్షతన నిర్వహించడ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిసి జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కుల సంఘాల చైర్మన్ కుందారం గణేష్ చారి, హాజరై ఆవిష్కరించడం జరిగింది.
అనంతరం బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ జవహర్ నగర్ లో ఉన్న రెండు డివిజన్లను బీసీలకే కేటాయించాలని ఒకవేళ కేటాయించకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధాన్ని ప్రకటిస్తామని బీసీ లందరూ ఐక్యంగా ఉన్నామని క్యాలెండర్ ద్వారా అర్థమవుతుందని తెలిపారు. రాష్ట్ర బీసీ కుల సంఘాల చైర్మన్ కుందారం గణేష్ చారి మాట్లాడుతూ, జవహర్ నగర్ లో కనివిని ఎరుగని రీతిలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరించాలని అన్నారు.
జవహర్ నగర్ తొలి మేయర్ మేకల కావ్య మాట్లాడుతూ కులాలు ఏవైనా ఉండొచ్చు కానీ బీసీ బిడ్డలుగా అందరం కలిసి ఉండాలని ఆ ఆశయంతోటే రాజ్యాధికారం సాధించుకోవాలని తెలిపారు. బీసీ ఐక్యవేదిక గౌరవ సలహాదారులు మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్ మాట్లాడుతూ బీసీ జేఏసీ బీసీల హక్కుల కొరకు రిజర్వేషన్ల కొరకు ఏ పిలుపునిచ్చిన జవహర్ నగర్ నుంచి మద్దతుగా పాల్గొంటామని అంతేకాకుండా జవహర్ నగర్ లో జ్యోతిరావు పూలే విగ్రహానికి అందరూ నడుంబించాలని నా వంతుగా ఆ విగ్రహానికి 50వేల రూపాయలు విరాళం అందిస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు తాటికొండ శ్రీరాములు చారి, రంగుల శంకర్, కారింగుల రాజు గౌడ్, కొండల్ ముదిరాజ్, పిన్నోజు సుధాకర్ చారి సోమనరసింహ ముదిరాజ్, ఉపాధ్యక్షులు గొడుగు వేణు ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి శని గారం నరసింహ, కోశాధికారి రేగోటి సురేష్ నేత, ఉపాధ్యక్షులు రాజు యాదవ్, మారోజు రమేష్ బాబు, నర్రా మహేష్, కర్నే సురేందర్, పల్లె కృష్ణ గౌడ్, కార్యదర్శులు పాక దేవేందర్, కాసోజు యాక చారి, ప్రచార కార్యదర్శి వెంకటాచారి, ఏ రాజు యాదవ్, అశోక్ యాదవ్, ఆంజనేయ చారి,
వల్లెపు మల్లేష్, కాసోజు రమేష్ చారి, కర్ణ గంటి పుల్లయ్య చారి, ప్రచార కార్యదర్శి రాం బ్రహ్మచారి, ఊల్లంగుల గాలయ్య, బీతోజు రామాచారి, బీజేఆర్ నగర్ విశ్వబ్రాహ్మణ సంఘం వ్యవస్థాపకులు సంగోజు ఆంజనేయులు చారి, ముత్తుస్వామి కాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు, ఆకునూరి నగేష్ చారి, హనుమయ్య, సత్యనారాయణ నేత, లింగాచారి, ముకుంద, విశ్వబ్రాహ్మణ హక్కుల సాధన సమితి, ప్రధాన కార్యదర్శి, వడ్ల గిరి, నాయకులు, సింగోజు సత్యం, యాదగిరి చారి, గొల్లపల్లి వెంకటేశ చారి, జేఏసీ సలహాదారులు సదానంద చారి, కాసోజు నాగరాజు చారి, వాచర్ల నరసింహ చారి,తదితరులు పాల్గొన్నారు.