రేపు కర్రెగుట్టలను సందర్శించనున్న డీజీపీ
09-08-2026 12:24 AM
ములుగులో భారీ బందోబస్తు
ములుగు, ఆగస్టు 8 (విజయ క్రాంతి): రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ కర్రెగుట్టల ప్రాంతాన్ని సోమవారం సందర్శించనున్నారు. మురుమూరు రహదారిలో అత్యంత పటిష్ఠంగా, వే గంగా రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నా యి. డీజీపీ పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యా ప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. భారీ గా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
డీజీపీ పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ములుగు డీఎస్పీతో పాటు సీఐలను, ఎస్‌ఐలను అప్రమత్తం చేశారు. కాగా ఇప్పటికే తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా ప్రకటించినప్పటికీ పోలీసులు మా త్రం తమ జాగ్రత్తచర్యల్లో ఎలాంటి లోపాలు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.






