15 April, 2026 | 3:16 AM

కామారెడ్డి జిల్లాలో పర్యటించిన డీజీపీ

15-04-2026 12:00 AM

ఎస్పీ కార్యాలయంలో స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ 

అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసిన డీజీపీ 

కామారెడ్డి, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన డిజిపి శివధర్ రెడ్డికి మంగళవారం ఎస్పీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్, ఎస్పి రాజేష్ చంద్ర పూల మొక్కతో స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయంలో డీజీపీ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కార్యాలయం ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, కామారెడ్డి ఏ ఎస్ పి చైతన్య రెడ్డి, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.