15 April, 2026 | 2:58 AM

నవ్య కళాశాల విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

15-04-2026 12:00 AM

జగిత్యాల, ఏప్రిల్ 14 ( విజయక్రాంతి ) :ఇంటర్ ఫలితాలలో నవ్య బాలికల జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు.ఎంపీసీ ఫస్ట్ ఇయర్ లో 467/470 మార్కులతో ఓదెల శ్రీవర్ష రాష్ట్ర స్థాయి మూడవ ర్యాంకు, బైపీసీ ఫస్ట్ ఇయర్ లో ఏ.ప్రఖ్య 433/440 మార్కుల తో పాటు ఎంపీసీ సెకండ్ ఇయర్ లో బోరగల్ల హంసిక 990/1000 , గుమ్ముల రోహిత 987/1000, బైపీసీ సెకండ్ ఇయర్లో సాంబారి హిమవర్షిని 982/1000 రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు.

విద్యార్థులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలనుండి నవ్య కళాశాల విద్యార్థులు జగిత్యాల కు గర్వకారణంగా రాష్ట్ర స్థాయిలో మార్కులు తీసుకుని వస్తున్నారని లాభాలు ఆశించకుండా అమ్మాయిలకోసం కళాశాలను ఆర్థికంగా భారం అయినా మంచి విద్యను అందిస్తున్న కళాశాల కరెస్పాండెంట్ శ్రీపాద నరేష్ ,ప్రిన్సిపల్ గాలిపెల్లి ఈశ్వర్ కుమార్ లను ప్రత్యేకంగా అభినందించారు.