17 June, 2026 | 8:40 PM

Breaking News

20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •   హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ కలిసిన మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ   •   అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు   •   సనాతన ధర్మాన్ని భావితరాలకు అందించాలి   •  

ధనుష్ ఇడ్లీ కడై

20-09-2024 12:56 AM

‘రాయన్’తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న స్టార్ హీరో ధనుష్ తర్వాతి ప్రాజెక్టు ‘డీ52’ను ప్రకటించారు. ధనుష్ హీరో, డైరెక్టర్‌గా రాబోతున్న ఈ మూవీకి ‘ఇడ్లీ కడై’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. దీనికి తెలుగులో ‘ఇడ్లి దుకాణం’ అని అర్థం కాగా, ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్లపై ఆకాశ్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌గా ధనుష్‌కు ఇది నాలుగో మూవీ. ఇండ్లీ బండి దగ్గర పిల్లలు నిల్చున్న టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్లజెంట్‌గా ఉంది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిర్మాత ఆకాశ్ బాస్కరన్ మాట్లుడుతూ.. ‘ఇది మా ప్రొడక్షన్ హౌస్‌కు ఒక మైల్ స్టోన్ మూవీ. ధనుష్ సర్‌తో కలిసి మా తొలి ప్రాజెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ధనుష్ గారికి థాంక్ యూ’ అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్; డీవోపీ: కిరణ్ కౌశిక్; ఎడిటర్: ప్రసన్న జీకే; ప్రొడక్షన్ డిజైనర్: జాకీ. మిగతా నటీనటులు సంబధించిన వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు.