11 August, 2026 | 7:15 PM

ఆసరా పెన్షన్లను సద్వినియోగం చేసుకోండి

11-08-2026 06:43 PM

బోథ్,(విజయక్రాంతి): గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 14 లక్షల ఆసరా పెన్షన్లు అర్హులైన వారు అందుకోలేకపోయారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆసరా పెన్షన్లను అందించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ డిసిసి ఎస్సీ సెల్ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి భీమ్రావు పాటిల్ విమర్శించారు. 2022 సంవత్సరం నుండి అరులైన వారికి పెన్షన్లను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసరా పెన్షన్లను అందించాలని నిర్ణయం తీసుకోవడం వల్ల పేద ప్రజల లో ఆనందం వ్యక్తం అవుతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్న ప్రభుత్వం మాత్రం పెన్షన్లను అందించేందుకు ముందుకు వస్తుంది అన్నారు. దరఖాస్తు చేసుకునేవారు అన్ని రకాల అర్హత పత్రాలను జతపరిచి మీసేవ కేంద్రాలలో పేద గ్రామపంచాయతీ కార్యదర్శులకు అందించాలన్నారు.