11 August, 2026 | 8:10 PM

ఘనంగా హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ

11-08-2026 07:04 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం వేంపల్లి వెంకట్రావుపేట గ్రామంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.జాతీయ జెండాను ప్రతి ఇంటిపై ఎగురవేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బైక్ ర్యాలీ నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ కొనసాగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుగ్లావత్ రాజేందర్, నాయకులు మిట్టపల్లి దివాకర్ రెడ్డి, గోపీనేని రాజేందర్, అరెల్లి కిషన్, వేముల నరేష్, రాజ్ యాదవ్, రాగెల్లి రాజేశం, భూక్యా మహేష్ తదితరులు పాల్గొన్నారు.