11 August, 2026 | 8:10 PM

అర్హులైన వారి ఇంటికి వెళ్లి పెన్షన్ దరఖాస్తులు స్వీకరిస్తున్న రాజమల్లు

11-08-2026 06:53 PM

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్  చింతకుంట విజయరమణారావు  ఆశీస్సులతో సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అర్హులైన నిరుపేదల నుండి పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందని సుల్తానాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ గాజుల రాజమల్లయ్య తెలిపారు.

మంగళవారం  మున్సిపల్ సిబ్బందితో కలిసి నేరుగా అర్హులైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి దరఖాస్తు ఫారాలను నింపి సేకరిస్తున్నారు. ప్రజల వద్దకే వచ్చి దరఖాస్తులు ప్రక్రియ చేస్తుండటంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుందని గాజుల రాజమల్లయ్య  తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంపత్,  శ్రీకాంత్,  హరీష్ తదితరులు ఉన్నారు.