calender_icon.png 2 May, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధరణి ఒక దగా.. ఒక వరం

24-04-2025 12:38:13 AM

  1. రైతులకు అండగా ఉంటాము ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి
  2. భూభారతి ద్వారా రైతులకు తక్షణమే న్యాయం కలెక్టర్ ఆదర్శ్ సురభి

పెబ్బేరు ఎప్రిల్ 23: ధరణి రైతులకు గుదిబండ గా మారి తే, భూభారతి ద్వారా అన్యాయానికి గురైన రైతులకు ఒక వరంగా మారనుందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి బుధవారం భూభారతి అవగాహనా సదస్సు లో అన్నారు. మండ్ల పరిధిలోని కంచిరావుపల్లి గ్రామంలో రైతువేదికలో అధికారులు భూభారతి అవగాహనా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి లు పాల్గొన్నారు.

ధరణి చట్టం ద్వారా అనేక సమస్యలు రైతులు ఎదుర్కోవటం స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, రైతులకు మేలు చేసే సరళమైన విధి విధానాలు రూపొందించి 14 నెలల అనంతరం భూభారతి ని అమలులోకి తెచ్చింది. గతంలో భూసమస్యల కోసం డబ్బు లు కట్టి, మళ్లీ కోర్టుల చుట్టూ తిరగాల్సిన అగత్యం ఏర్పడింది. ఇప్పుడు అలాంటి బాధలు రైతులకు లేకుండా దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

భూ సర్వే కోసం 1000 మందిని నియమించటంతో పాటు, 600 మంది ప్రైవేటు సర్వేయర్ లను తర్ఫీదు ఇచ్చి వారి సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వం రెవెన్యూ అధికారుల ను దోషులుగా ప్రజలకు చూపారని అందుకే భూ భారతి తెచ్చి ఉద్యోగస్తులకు తిరిగి గౌరవం సమకూరుస్తామని అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 26 లక్షల మంది రైతులకు రుణ మాఫీ చేసామని అన్నారు.

3.10 కోట్ల రేషన్ కార్డులు, వారికి సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్, విశ్రాం త ఐఎఎస్ ఆకునూరి మురళి సూచన మేరకు 5 కోట్ల వ్య యంతో, మండలానికో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటాం, లాగ్ బుక్ ఎంట్రీ పద్దతి వివరాలు పొందుపరుస్తామని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు పారదర్శకంగా ఉండాలని, లబ్ధిదారులు 425 నుంచి 600 అడుగుల లోపు నిర్మా ణం చేసుకోవాలని సూచించారు. శ్రీరంగాపూర్ రిజర్వాయర్ కింద ఇళ్లసమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు.

శ్రీ రంగనాయక ఆలయ శోభను పెంచేందుకు 150 కోట్ల రూ పాయలు మంజూరు చేసామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, పెబ్బేరు మార్కెట్ యార్డు చైర్ పర్సన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజ య వర్దన్ రెడ్డి, తహశీల్దార్ లక్ష్మి, శ్రీరంగాపూర్ తహసీల్దార్ మురళి, ఎంపీడీవో రవీందర్, రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.