calender_icon.png 20 January, 2026 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 24న బాలాపూర్‌లో ‘ధర్మ రక్షణ సభ’

20-01-2026 12:50:53 PM

* ​విజయవంతం చేయాలని అఖిలపక్ష నాయకుల పిలుపు

బడంగ్‌పేట్,(విజయక్రాంతి): బాలాపూర్ మండల పరిసర ప్రాంతాల్లో పెరుగుతున్న అక్రమ వలసదారుల చొరబాటును నిరసిస్తూ, హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంగా ఈనెల 24న బాలాపూర్ హనుమాన్ టెంపుల్ సమీపంలో భారీ ‘ధర్మ రక్షణ సభ’ నిర్వహించనున్నట్లు అఖిలపక్ష నాయకులు వెల్లడించారు. సోమవారం బాలాపూర్ వేణుగోపాల్ స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహేశ్వరం నియోజకవర్గ స్థాయి అఖిలపక్ష నేతలు పాల్గొని సభకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 24న నిర్వహించే ధర్మ రక్షణ సభకు పార్టీలకు అతీతంగా హిందూ ధర్మ పరిరక్షకులు, సాధువులు, సంతులు, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరవుతున్నట్లు తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. గత కొంతకాలంగా బాలాపూర్ మండల పరిసర ప్రాంతాల్లో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల నుంచి వచ్చిన వారు చొరబడి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది చాప కింద నీరులా విస్తరిస్తోందని, భవిష్యత్తులో వీరి వల్ల ఉగ్ర ముప్పు పొంచి ఉండే అవకాశం ఉందని వారు హెచ్చరించారు. స్థానిక శాంతిభద్రతలకు విఘాతం కలగకముందే మేల్కొనాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కోలన్ శంకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిగురింత నరసింహారెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు వంగేటి లక్ష్మారెడ్డి, వంగేటి ప్రభాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రఘునందన చారి, నవారు శ్రీనివాస్ రెడ్డి, శశిధర్ రెడ్డి, సింగి రెడ్డి పెంట రెడ్డి, బొర్ర రవి మాదిగ, కొంతం ప్రకాష్ రెడ్డి, కోటగిరి మున్నా, మేకల సంజీవ, కృష్ణం రాజు గౌడ్, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.