12-11-2025 10:15:29 AM
ముంబై: ప్రముఖ నటుడు ధర్మేంద్ర(Dharmendra discharged) బుధవారం ఉదయం దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి(Breach Candy Hospital) నుండి డిశ్చార్జ్ అయ్యారని, ఇంట్లోనే కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 89 ఏళ్ల నటుడు కొన్ని పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన కొన్ని రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. అయితే కుటుంబ సభ్యులు, ఆసుపత్రి అధికారులు ఆ విషయాన్ని వెల్లడించలేదు. "ధర్మేంద్ర ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించాలని నిర్ణయించినందున, ఆయనకు ఇంట్లోనే చికిత్స అందించబడుతుంది" అని నటుడు చికిత్స పొందుతున్న బ్రీచ్ కాండీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ప్రతీత్ సందానీ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.
నటుడి ఆరోగ్యం గురించి అడిగినప్పుడు, ధర్మేంద్ర ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని మాత్రమే తాను ధృవీకరించగలనని సమదానీ అన్నారు. జుహు శివారు ప్రాంతంలోని ధర్మేంద్ర పెద్ద కుమారుడు సన్నీ డియోల్ నివాసానికి ఆసుపత్రి నుండి అంబులెన్స్ బయలుదేరడం కనిపించింది. మంగళవారం, అనేక మీడియా సంస్థలు ధర్మేంద్ర మరణం గురించి కథనాలు ప్రచురించాయి. ధర్మేంద్ర మృతిచెందారని సోమవారం రాత్రి నుంచి వెలువడిన వార్తలను ఆయన సతీమణి, ప్రముఖ నటి హేమా మాలిని(Hema Malini) కొట్టివేశారు.ఫేక్ న్యూస్‌పై ఆమె మండిపడ్డారు. మీడియా సంస్థలు బాధ్యత మరచి అబద్ధపు వార్తలు ప్రచురించడం సరికాదని హెచ్చరించారు. మరోవైపు నాన్న క్షేమంగా ఉన్నారు.. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స జరుగుతోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ధర్మేంద్ర కుమార్తె, సినీ నటి ఈషాడియోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించారు.