17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఎపిక్ లవ్ అండ్ వార్.. ‘మోగ్లీ 2025’

12-11-2025 09:12 PM

యంగ్ హీరో రోషన్ కనకాల ఇప్పుడు ‘మోగ్లీ 2025’తో వస్తున్నారు. ‘కలర్ ఫోటో’ మూవీ ఫేమ్ సందీప్‌రాజ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

సాక్షి మడోల్కర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బండి సరోజ్‌కుమార్, హర్ష చెముడు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

అడవి నేపథ్యంలో యూనిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఫస్ట్ సింగిల్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను స్టార్ హీరో ఎన్టీఆర్ లాంచ్ చేశారు. ఈ టీజర్.. ప్రాజెక్ట్‌పై బజ్‌ను మరింత పెంచింది.

జీవితాన్ని సంతోషంగా గడపాలనుకునే యువకుడు మోగ్లీ. ఓ అందమైన అమ్మాయిని ప్రేమించిన తర్వాత అతని ప్రపంచం ఒక మలుపు తిరుగుతుంది. రామజ ప్రేమకథలా వీరిద్దరి ప్రేమ కూడా అందంగా ఉంటుంది. వీరి సంతోషంలో రాక్షసుడు లాంటి పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అవుతాడు. దీంతో అంతా యుద్ధ భూమిగా మారుతుంది. 

దర్శకుడు సందీప్ రాజ్ టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. రామ హీరోహీరోయిన్లను, రావణుడిలా విలన్‌ను చూపుతూ ఆధునిక రామాయణంలా ఆవిష్కరించారు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ మైథాలజీ ఫీల్ మోడరన్ ఎమోషన్‌తో మిళితం చేస్తుంది. 

రోషన్ కనకాల అద్భుతంగా కనిపించాడు. తన పాత్ర కోసం ఆయన ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని, కొత్త లుక్‌తో, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఉత్తరాంధ్ర యాసలో చెప్పిన డైలాగులు సహజంగా ఆకట్టుకున్నాయి. అతనికి జోడీగా నటించిన సాక్షి మదోల్కర్ చెవిటి, మూగ అమ్మాయిగా సహజంగా నటించింది. ఇద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకుల మనసు తాకింది. విలన్‌గా బండి సరోజ్ కుమార్ ఇంటెన్స్‌గా కనిపించగా, హీరో స్నేహితుడిగా వైవా హర్ష తన కూల్ హ్యూమర్‌తో అలరించాడు.

సినిమాటోగ్రాఫర్ రామ మారుతి ఎం అద్భుతమైన విజువల్స్ అందించారు. కాళాభైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథకు  మరింత డెప్త్ ని జోడించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు అత్యుత్తమంగా ఉన్నాయి. ఎడిటర్ కోదాటి పవన్ కల్యాణ్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ మామిడి, యాక్షన్ కొరియోగ్రాఫర్ నటరాజ్ మడిగొండ అద్భుతమైన వర్క్‌తో అలరించారు.  

స్ట్రాంగ్ కాన్సెప్ట్, అద్భుతమైన విజువల్స్‌తో వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం డిసెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. 

ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ; డీవోపీ: రామ మారుతి ఎం; యాక్షన్: నటరాజ్ మాడిగొండ; ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్; ఆర్ట్: కిరణ్ మామిడి; నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్; రచనాదర్శకత్వం: సందీప్ రాజ్.