26 July, 2026 | 11:55 AM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా విఠలేశ్వర మందిరంలో హరినామ స్మరణ.

26-07-2026 10:53 AM

బోథ్,(విజయక్రాంతి): వైకుంఠ ఏకాదశి సందర్భంగా మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయంలో కౌటా బి నుండి వచ్చిన శబరిమాత ఆశ్రమ బృందం వారు రాత్రిపూట హరినామ స్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి ఒంటి గంట వరకు రామనామ స్మరణ చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కౌట బి గ్రామానికి చెందిన బద్దం ప్రభాకర్ రెడ్డి హరినామ స్మరణ చేస్తూ గానం ఆలపించారు. ఈ కార్యక్రమంలో కౌటబి గ్రామ శబరిమాత ఆశ్రమం పూజారి ఎడమల ధర్మారెడ్డి మెరుగు జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.