ధోనీ ప్రాక్టీస్ షురూ
చెన్నై, ఏప్రిల్ 2 : చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్... మాజీ కెప్టెన్ మ హేంద్రసింగ్ ధోనీ అనుకున్న సమయానికంటే ముందుగానే మైదానంలోకి రానున్నాడు. కండరాల నొప్పితో ప్రస్తుతం ఆటకు దూరమైన ధోనీ జట్టుతో పాటే ఉన్నాడు. తాజాగా చెపాక్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో మ్యా చ్‌కు ముందు ధోనీ సహచర ఆటగాళ్ళతో కలిసి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. మోకాలికి ఉన్న కట్టు కూడా తీసేసాడు.
దీంతో దాదా పు ఆరు మ్యాచ్‌ల వరకూ అందుబాటులో ఉండడనుకున్న ధోనీ ఇంకా ముందే బరిలోకి దిగే అవకాశముందని సమాచారం. ఈ సీజన్ తొలి మ్యాచ్‌కు ముందు ధోనీ అనూహ్యంగా కండరాల నొప్పితో బాధపడడంతో 2-3 వారాలు దూరమవుతాడని సీఎస్కే ఫ్రాంచైజీ ప్రకటించింది. గత వారం మోకాలికి బెల్ట్ వేసుకుని కూడా కనిపించడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఈ సీజన్ ఆరంభంలో సీఎస్కే ట్రైనింగ్ క్యాంపులోనూ ధోనీ కాస్త అసౌకర్యంగా కనిపిం చాడు.




