ఐపీఎల్ జట్ల పెంపు కష్టమే
- స్పష్టం చేసిన అరుణ్ ధుమాల్
- విండో దొరకదన్న ఐపీఎల్ ఛైర్మన్
ముంబై, ఏప్రిల్ 2 : ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత విజయవంతమైన లీగ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు ఆదరణ పెంచుకుంటూ, బ్రాండ్ వాల్యూ కూడా భారీస్థాయిలో పెరిగింది. జట్ల సంఖ్య 8 నుం చి 10కి చేరింది. అయితే లీగ్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా జట్ల సంఖ్య పెంచాలన్న అభిప్రా యం వ్యక్తమవుతోంది. దీనిపై గతంలోనే బీసీసీఐ వర్గాల్లోనూ చర్చ జరిగింది. తాజా గా ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఐపీఎల్ జట్ల సంఖ్య పెంచే అంశంపై లీగ్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. ఇప్పట్లో జట్లను పెంచే అవకాశం లేదన్నారు. అలాగే మ్యాచ్‌ల సంఖ్య పెంపు కూడా సా ధ్యం కాదన్నారు. జట్ల సంఖ్య పెంచితే సహజంగానే మ్యాచ్‌లు పెరుగుతాయని, అయితే అంతర్జాతీయ షెడ్యూల్ లో భారీ విండోకు సర్దుబాటు దొరకడం చాలా ఇబ్బంది అవుతుందన్నారు. మార్చి నుంచి మే మధ్య ఉన్న విండోలో మాత్రమే నిర్వహించగలమని, విదేశీ ఆటగాళ్లకు అంతర్జాతీయ సిరీస్ లు ఉండడంతో వారికి కుదరదన్నారు.
ఒకవేళ జూన్ వరకూ కొనసాగించాలనుకున్నా కూడా ఇక్కడ వాతావరణ పరిస్థితులు అనుకూలించవన్నారు. ఎందుకంటే దక్షిణ భార తంలో పలు చోట్ల వర్షాలు పడుతుంటాయని, షెడ్యూల్ ప్లాన్ చేయడం కష్టంగా మారుతుందన్నారు. అటు డబుల్ హెడర్ మ్యాచ్‌ల పైనా క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఒకేసారి డబుల్ హెడర్ మ్యాచ్‌లు నిర్వహిం చాలన్నా చాలా ఇబ్బందులున్నాయని చె ప్పారు.
ఈ అంశాలన్నింటినీ పరిశీలించే 74 మ్యాచ్‌ల విండోను నిర్వహిస్తున్నట్టు అరుణ్ ధుమాల్ చెప్పుకొచ్చారు. కాగా ఇప్పటికే టీ మిండియా ఇంటర్నేషనల్ మ్యాచుల విరా మం లేని బిజీ షెడ్యూల్తో కిక్కిరిసిపోయింది. ఇలాంటి తరుణంలో ఐపీఎల్ విస్తృతిని పెంచడం సాధ్యం కాదని అతడు పరోక్షంగా స్పష్టం చేశాడు. కాగా 2023, 2024 సీజన్ల నుంచీ 74 మ్యాచ్ లనే కొనసాగిస్తున్నారు. జట్ల సంఖ్య పెరగడంతో 94 మ్యాచ్‌ల వర కూ సీజన్ జరుగుతుందని వార్తలు వచ్చినా అదేమీ లేదని బీసీసీఐ స్పష్టం చేసింది.




