13-12-2025 01:38:18 AM
పాకిస్థాన్ వ్యతిరేక చిత్రమని భావించి బ్యాన్
న్యూఢిల్లీ, డిసెంబర్ 12: రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్‌దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధురంధర్’. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతున్నది. బాలీవుడ్ బాక్సాఫీసులో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. అయితే.. చిత్రం ఓ వివాదంలో చిక్కుకున్నది. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, కువైట్, ఒ మన్ వంటి గల్ఫ్ దేశాలు ఈ చితాన్ని బ్యాన్ విధించాయి.
తమ దేశాల్లో ఈ సినిమా ప్రదర్శనను పూర్తిగా నిలిపిశాయి. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా చిత్రాన్ని తెరకెక్కించడం, ఆ దేశానికి చెందిన ఓ మాఫియా డాన్‌కు సం బంధించిన నిజ జీవిత ఘటనలపై సినిమా తీయడం వల్లే ఆయా దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్‌కు గల్ఫ్ ముఖ్యమైన మార్కెట్ కావడంతో ఆయా దేశాల్లో చిత్ర ప్రదర్శన కొనసాగించాలని మేకర్స్ ఆయా దేశాలను కోరుతున్నా రు. అయినప్పటికీ.. వారి ప్రయత్నాలు ఫలించలేదు. చిత్రానికి గల్ఫ్ నుంచి పెద్ద దెబ్బ పడినప్పటికీ, భారత్‌తోపాటు ఓవర్‌సీస్ మా ర్కెట్‌లో దూసుకుపోతున్నది. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల మార్క్ దాటింది.