ధ్యాన్‌చంద్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ప్రదానం
ముషీరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షు డు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఆడిటోరియ ంలో మేజర్ ధ్యాన్ చంద్ ఎక్సలెన్స్ అవారడ్స్-2026ను ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్ట రెడ్డి హాజరై అందజేశారు. ముందుగా మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జస్టిస్ బి.చంద్రకుమార్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొ.ఇటికల పురుషోత్తం ప్రసంగించారు.
రాష్ట్రపతి అ వార్డు గ్రహీత కె.సాయి బాబా, ఓయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ప్రొ.కె.దీప్లా పాల్గొని అవార్డు గ్రహీతలు సురేష్ కుమార్, అనిత, సందీప్ రెడ్డి, వెంకన్న, బి.ఆర్.నేత, డా. పుంజాల సుప్రియ, డా.ఏ.సిద్ధార్థ, డా.ఆర్. మురళి, మేజర్ డి.జయసుధ, మేజర్ కె.ఏ.శివప్రసాద్, పొటెల్ శ్రీనివాస్ యాదవ్ లను సత్కరించారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సాధుల మ ధుసూదన్, జంట నగరాల గుజరాతీ బ్రహ్మ సమాజ్ అధ్యక్షుడు తరుణ్ కుమార్ మేత, కార్యదర్శి డా.మొహమ్మద్ అక్తర్ అలీ, చీఫ్ కోఆర్డినేటర్ డా.రవితేజ, కోఆర్డినేటర్లు జి. వేణుగోపాల్, కె.రవీందర్, సూర్య పాల్గొన్నారు.






