30 August, 2026 | 2:52 AM

చోరీ చేసిన బైక్‌తో పట్టుబడిన వ్యక్తి

30-08-2026 12:00 AM

ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో వెలుగులోకి.. 

శంషాబాద్, ఆగస్టు 29 విజయక్రాంతి: శంషాబాద్ ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీసుల ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో చోరీకి గురైన ద్విచక్ర వాహనం పట్టుబడింది. శంషాబాద్లోని ఆర్జీఐఏ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9.55 గంటలకు పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ 09 సీఏ 5863 నంబర్ గల ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న వ్యక్తిని ఆపి వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. అయితే సదరు వ్యక్తి చెల్లుబాటు అయ్యే వాహన పత్రాలను చూపించలేకపోయాడు.

దీంతో పోలీసులు వాహనానికి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించగా, ఆ మోట్సాకిల్ హైదరాబాద్ సిటీ పరిధిలోని గోపాల్పురం పోలీస్స్టేషన్లో క్రైమ్ నంబర్ 253/2023, ఐపీసీ సెక్షన్ 379 కింద నమోదైన దొంగతనం కేసులో చోరీకి గురైన వాహనంగా గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని సంబంధిత పోలీస్స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అనంత రం అవసరమైన పత్రాలను స్వీకరించి, తదుపరి దర్యాప్తు, చట్టపరమైన చర్యల నిమిత్తం సదరు మోట్సాకిల్ను గోపాల్పురం పోలీస్స్టేషన్ మల్కాజ్గిరి అధికారులకు అప్పగిం చారు. ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో చోరీ వాహ నం గుర్తించడం ద్వారా ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తత మరోసారి వెల్లడైంది.