నేడు మేడ్చల్ డిపోలో డయల్ యువర్ ప్రోగ్రాం
25-05-2026 12:00 AM
మేడ్చల్ ఆర్టీసీ డిపో మేనేజర్ పరిమళ
మేడ్చల్ అర్బన్ మే 24 (విజయక్రాంతి): మేడ్చల్ టిఎస్ ఆర్టిసి సర్వీసులలో ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పించేందుకు ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యల సత్వర పరిష్కారానికి ఇతరత్రా అంశాలపై సూచనల కోసం నేడు ఉదయం 12 గంటల నుండి ఒంటిగంట వరకు మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ పరిమళ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడ్చల్ టీఎస్ ఆర్టీసీ సర్వీసులలో ఎలాంటి సమస్యలు నెలకొన్న 9959226152 నంబర్కు తగు సూచనలు చేయాలని ఆమె ప్రయాణికులను కోరారు.






