పాఠశాలల దుస్థితి మారలే
- ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే పరిస్థితి
- 10ఏళ్లలో మూతపడ్డ 94వేల పాఠశాలలు
- ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుకు కళ్లెం వేయాలి
- పాఠశాలలపై ప్రశ్నిస్తే హత్యలకు గురికావడంపై ఆగ్రహం
- సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
ముంబై, ఆగస్టు 16: దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ పాఠశాలల దుస్థితి మాత్రం మారలేదని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. పభుత్వ పాఠశాలలను బాగుచేయలనే ప్రచారానికి మహారాష్ట్ర హింగోలీ సొంత గ్రామం నుంచే జాతీయస్థాయిలో శ్రీకారం చుట్టారు. దీప్కే సొంతగ్రామం సంతుక్ పింప్రీలో జెండా పండుగలో పాల్గొన్న దీప్కే అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించారు. మరుగుదొడ్లు, కనీస వసతులు, నీటి సదుపాయం లేని దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 94వేలకు పైగా దేశంలో గత పదేళ్లలో మూతపడ్డాయని ఆరోపించారు. కొత్త పాఠశాలలు తెరవాల్సిన చోట ఉన్నవి మూసివేస్తే దేశం ఎలా బాగుపడుతుందని ప్రశ్నించారు.
దేశంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న దారుణమైన పరిస్థితులపైన ఉద్యమిస్తామన్నారు. సీఎం తిరంగా ర్యాలీలో భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఆ డబ్బు గ్రామీణ ప్రాంతాల పాఠశాలలు, విద్యార్థుల కోసం ఖర్చు చేస్తే బాగుండేదని అన్నారు. అదే సమయంలో తల్లిదండ్రులను ఫీజుల పేరుతో దోపిడీకి దిగుతున్న ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులకు కళ్లెం వేసే చర్యలను చేపట్టాలని దీప్కే డిమాండ్ చేశారు. కాగా అబ్దుల్ అనే వ్యక్తి తాను చదువుకున్న పాఠశాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నించాడని, సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టడంతో పలువురు (బీజేపీ సంబంధించిన వారు) అతని ఇంటిపై దాడికి పాల్పడి ఆయన తండ్రికి కారణమయ్యారని దీప్కే ఎక్స్ పోస్టులో పలు ఆరోపణలు గుప్పించారు.
ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై ప్రశ్నిస్తే చంపేస్తారా? అని మండిపడ్డారు. పాఠశాలలు కోరినందుకే ప్రజలు హత్యకు గురవుతున్నారంటే తన రక్తం మరిగిపోతుందని అభిజిత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు.






