10 March, 2026 | 8:21 AM

అతిసారం వ్యాధిని నియంత్రించాలి: డాక్టర్ సుధాకర్ నాయక్

18-06-2025 06:16 PM

మఠంపల్లి: 5 సంవత్సరాలలోపు పిల్లలలో కలిగే అతిసార వ్యాధిని నియంత్రించడం ద్వారా శిశు మరణాలను తగ్గించడం కోసం మండల వైద్యాధికారి డా.సుధాకర్ నాయక్(Mandal Medical Officer Dr. Sudhakar Nayak) అధ్యక్షతన మండల స్థాయి టాస్క్ఫోర్స్ మీటింగ్ ను మఠంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రము నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మాట్లాడుతూ... ఈ నెల 16వ తేదీ నుండి జూలై 31 వరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఆశా వర్కర్లు ప్రతి గృహాన్ని సందర్శించి 5 సంవత్సరాలలోపు పిల్లల అతిసార వ్యాధికి గురైనట్లుగా గుర్తిస్తే వారికి వెంటనే ఇంటివద్దే జింక్ మాత్రలు, ఓఆర్ఎస్ ద్రావణంతో చికిత్స చేస్తారని ఇంకా అవసరమైతే వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి జగదీష్, మండల విద్యాధికారి వెంకటాచారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అధికారులు అంగన్వాడి సూపర్వైజర్లు పాల్గొన్నారు.