17-12-2025 06:21:05 PM
22న సర్పంచుల ప్రమాణ స్వీకారం..
నకిరేకల్ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. ముందుగా ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం నిర్వహించాలని నిర్ణయించగా, ఆ రోజు సరైన ముహూర్తాలు లేకపోవడంతో తేదీ మార్పు చేయాలని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న పంచాయతీరాజ్ శాఖ, ‘అపాయింటెడ్ డే’ను డిసెంబర్ 22వ తేదీకి మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 22వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులందరూ ఒకే రోజున పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రామ పరిపాలన మొదలుకానున్నది.