19 March, 2026 | 2:15 AM

సిక్సర్ బాదేనా?

19-03-2026 12:34 AM

* ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్స్ అనగానే గుర్తొచ్చే పేరు ముంబై ఇండియన్స్... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అన్ని టైటిల్స్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో వచ్చినవే. స్వదేశీ, విదేశీ స్టార్ ప్లేయర్స్‌తో ప్రతీసారీ హాట్ ఫేవరెట్ లిస్టులో ఖచ్చితంగా ఉండే ముంబై ఇండియన్స్ గత ఐదేళ్లుగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. గత సీజన్ లో ప్లే ఆఫ్స్ కు చేరడమే బెస్ట్ పెర్ఫార్మెన్స్.. మరి ఈ సారైనా ముంబై టైటిల్ గెలిచి సిక్సర్ కొడుతుందా ?

  1. ఆరో ట్రోఫీ రేసులో ముంబై
  2. గత సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కే పరిమితం
  3. స్టార్ ప్లేయర్స్‌ను వదులుకోని ముంబై
  4. రోహిత్, బుమ్రాలపై అంచనాలు

ముంబై, మార్చి 18 : ఐపీఎల్ ఎప్పుడు వచ్చినా టైటిల్ ఫేవరెట్ రేసులో ఖచ్చితంగా వినిపించే పేరు ముంబై ఇండియన్స్... ఆరంభంలో తడబడినా.. మధ్యలో చతికిలపడినా చివరికి వచ్చేసరికి మాత్రం అద్భుతమైన ఆటతీరుతో ట్రోఫీ ఎగరేసుకుపోవడం ముం బైకే చెల్లింది. అందుకే ప్రతీ సీజన్‌లోనూ టై టిల్ రేసులో ముందుంటుంది. అయితే చివరిసారిగా 2020లో ట్రోఫీ గెలిచిన ముంబై ఆ తర్వాత వరుసగా చతికిలపడుతూ వస్తోం ది.

2024 సీజన్‌లో అయితే మరీ దారుణం గా చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. గత సీజన్‌లో మాత్రం ప్లే ఆఫ్స్‌కు చేరగలిగింది. ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ టైటిల్ గెలవాలనే పట్టుదలతో మినీ వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మిగిలిన ఫ్రాంచైజీ లతో పోలిస్తే అతితక్కువ మొత్తం రూ.2.75 కోట్లతోనే బరిలోకి దిగిన ముంబై తమ కు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసిం ది. తమ మాజీ ప్లేయ ర్ క్వింటన్ డికాక్‌ను అతని కనీస ధర కోటి రూపాయలకే దక్కించుకుంది. 

ప్రధాన ఆటగాళ్లంద ర్నీ వేలానికి ముందే రిటైన్ చేసుకోవడంతో పాటు ట్రేడింగ్ ద్వా రా కీలక ఆటగాళ్లను జట్టులోకి తెచ్చుకుంది. శార్దూల్ ఠాకూర్, రూథర్ ఫోర్డ్, మయాంక్ మార్కండేలను ట్రేడ్ చేసుకుంది. ఈ కారణంగానే మినీ వేలంలో ముంబై ఇండియన్స్ పెద్దగా కసరత్తు చేయాల్సిన అవసరం లేకపోయిం ది.

తక్కువ మొత్తంతోనే వేలానికి వెళ్లి బ్యాక ప్ ఓపెనర్‌తో పాటు వికెట్ కీపర్ స్థానా న్ని డికాక్‌తో భర్తీ చేసుకుంది. అలాగే పాటు డానిష్ మలెవార్, మహమ్మద్ ఇజార్, అథ ర్వ అంకోలేకర్, మయాంక్ రావంత్ వంటి అనామక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 

ముంబై బ్యాటింగ్ ఆర్డర్ చూస్తే ప్రత్యర్థి జట్ల బౌలర్లకు గుండెల్లో దడే. ఎందుకంటే హిట్‌మ్యాన్  నుంచి చివర్లో ఆల్ రౌండర్ కమ్ కెప్టెన్ హార్థిక్ పాం డ్యా వర కూ అందరూ టీ ట్వంటీ స్పెషలిస్టులే. రోహి త్ , డికాక్ ఇన్నింగ్స్ ఆరంభించనుండగా పవర్ ప్లేలో వీరిని కాచుకోవడం ప్రత్యర్థి బౌలర్లకు అతిపెద్ద సవాల్. అలాగే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి హిట్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. వీరితో పాటు రూథర్ ఫర్డ్ , రికెల్టన్ కూడా రెచ్చిపోతే భారీస్కోర్లు ఖాయం.

ఇక ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపుతిప్పే కెప్టెన్ హార్థిక్ పాండ్యా అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ సత్తా చాటుతున్నాడు.. ఇక బౌలింగ్‌లో ముంబై ప్రధాన అస్త్రం జస్ప్రీత్ బుమ్రా. ఈ స్టార్ పేసర్ ముంబై విజయాల్లో కీలకంగా ఉం టాడు. అతనితో పాటు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, శార్థూల్ ఠాకూర్‌లతో పేస్ ఎటాక్ మరింత బలపడింది. స్పిన్ విభాగంలో మిఛెల్ శాంట్నర్ తో పాటు స్వదేశీ స్పిన్నర్ మయాంక్ మార్కండే లాంటి యువ ఆటగాడు ఉండడం కూడా అడ్వాంటేజ్‌గా చెప్పొచ్చు.

అయితే ఈ సీజన్‌లో తుది జట్టు ఎంపి క ముంబై టీమ్ మేనేజ్ మెంట్‌గా పెద్ద సవా ల్‌గా భావిస్తున్నారు.  ఆరంభంలో తడబాటు ఆ జట్టును గత కొన్ని సీజన్లుగా వెంటాడుతూ వస్తోంది. దీనిని అధిగమిస్తే హార్థిక్ పాండ్యా సారథ్యంలో ముంబై ఇండియన్స్ తొలి టైటి ల్, మొత్తంగా ఆరో ట్రోఫీ సాధించడం పెద్ద కష్టం కాదు. 

ముంబై ఇండియన్స్ జట్టు 

రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రికెల్టన్, తిలక్ వర్మ, రాబిన్ మింజ్, మిచెల్ సాంట్నర్, నమన ధీర్, విల్ జాక్స్, కార్బిన్ బోష్, రాజ్ అంగద్ బావా, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహార్, అల్లా గజన్ఫర్, శార్దూల్ ఠాకూర్, రూథర్‌ఫర్డ్, మయాంక్ మార్కండే, క్వింటన్ డికాక్, దానిష్ మలేవర్, అథర్వ అంకోలేకర్, మొ హమ్మద్ ఇజ్హార్, మయాంక్ రావత్