భావోద్వేగాల తీరం
శ్రీ భవానీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న భావోద్వేగ ప్రధాన చిత్రం ‘తీరం’. ప్రభు, హరిప్రియ, వైశాలి, నిరు డి శ్రీనివాస్, సంధ్య, కిట్టయ్య, శిరీష ప్రధాన తారాగణంగా ఈ సినిమాను దర్శకుడు వంశీ మునగాల తెరకెక్కిస్తున్నారు. ఉపేందర్ గంగావెల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సిని మా టైటిల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో ప్రభు మాట్లాడుతూ.. “ఫీచర్ ఫిలిం హీరోగా నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకుల ఆశీర్వాదాలు కోరుతున్నా” అన్నారు. ‘ఇది నా కెరీర్‌లో ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంద’ని హీరోయిన్ హరిప్రియ తెలిపింది. దర్శకుడు వంశీ మునగాల మాట్లాడుతూ.. “తీరం’ ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా భావోద్వేగభరితమైన కథతో రూపొందుతోంది” అని చెప్పారు. నిర్మాత ఉపేందర్ మాట్లాడుతూ.. “సినిమా నిర్మాణం తుది దశకు చేరుకుంది. విడుదల తేదీ, ఇతర విశేషాలను త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు.






