28 July, 2026 | 1:58 AM

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఆడిట్ కమిటీకి వినతి

28-07-2026 01:30 AM

తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి 

ముషీరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య, రాష్ట్ర  అధ్యక్షుడు బాలకృష్ణారెడ్డితో పాటు జేఏసీ ప్రతినిధులు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆఫీసర్స్ ఆడిట్ కమిటీ సభ్యులు మహ్మద్ నదీమ్, ఐఏఎస్, డాక్టర్ గౌరవ్ ఉప్పల్, ఐఏఎస్, ఈవీవీ నాగేశ్వరరావులను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఏజెన్సీల అక్రమాలు, అధికారుల వేధింపులు, నిరుద్యోగుల నుంచి బలవంతపు వసూళ్లు, సుప్రీంకోర్టు సూచించిన సమాన పనికి సమాన వేతనం అమలు, పెండింగ్ జీతాల విడుదల, ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరిని ఐఎఫ్‌ఎంఐఎస్ పోర్టల్లో చేర్చడం వంటి అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో పద్మ, రాజ్, మమ్మద్ తో పాటు జేఏసీ నాయకులు పాల్గొన్నారు.