22-06-2025 12:00:00 AM
అనుష్క శెట్టి, విక్రమ్‌ప్రభు ప్రధాన పాత్రల్లో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఘాటి’. జూలై 11న విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో జోరు పెంచింది టీమ్. ఇందులోభాగంగా ఈ చిత్రంలోని ఫస్ట్‌సింగిల్ ‘సైలోరే..’ను శనివారం విడుదల చేశారు. ‘పుట్టగానే బెమ్మ ముడిపెట్టెరో.. వయసు తాకి జంట కట్టెరో.. బతుకునంత తోడులోన చూసెరో.. అడుగు అడుగు మొదలుపెట్టెరో..’ అంటూ సాగుతోందీ పాట. క్రిష్ సాహిత్యం అందించిన ఈ గీతానికి సాగర్ నాగవెల్లి సంగీతం అందించగా లిప్సిక, సాగర్ నాగవెల్లి, సోనీ ఆలపించారు.