calender_icon.png 22 June, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరమల్లు కొత్త డేట్

22-06-2025 12:00:00 AM

పవన్‌కళ్యాణ్ చారిత్రక యోధుడిగా నటించిన చిత్రం ‘హరిహరవీరమల్లు’. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ దయాకర్‌రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

అనుపమ్‌ఖేర్, సత్యరాజ్, జిషుసేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ మూవీ ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. పవన్‌కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా అటు మేకింగ్‌లో ఆలస్యమైంది. ఆ తర్వాత విడుదల విషయంలోనూ పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నెల 12న బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు.

అయితే, తాజాగా నిర్మాతలు మూవీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. జూలై 24న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు తాజా విడుదల తేదీని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి; సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్; ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్; స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజారో జుజీ, రామ్‌లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్; కూర్పు: ప్రవీణ్ కేఎల్; కళా దర్శకుడు: తోట తరణి.