11 August, 2026 | 5:36 PM

Breaking News

ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా మల్యాల అంజయ్య నియామకం   •   దన్నూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల యూనిఫామ్ డ్రస్సుల కుట్టడం త్వరలో పూర్తి చేయాలి   •   రామప్ప నుండి గణప సముద్రానికి నీటిని తరలించాలి   •   జొన్న రైతుల డబ్బుల విషయంలో ఆందోళన వద్దు   •   రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో బంగారు, రజిత పథకాలు సాధించిన ఐపీఎస్‌ విద్యార్థులు   •   మాల్తుమ్మెద గ్రామంలో గడ్డి మందు పిచికారి   •   చలివాగు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి   •   భిక్కనూర్‌లో సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   రోడ్డు సౌకర్యంతో పాటు తాగునీరు అందించండి మహాప్రభో   •  

తెలుసు కదా కొత్త షెడ్యూల్‌లో చేరింది

23-08-2024 12:57 AM

చిత్ర పరిశ్రమ.. ఓ గ్లామర్ ప్రపంచం. ఇక్కడ హీరోయిన్లకు  ఎప్పుడు స్టార్ డమ్ వ స్తుందో ఎవరూ చెప్పలేరు. ఒ క్క సినిమాతో ఓవర్ నైట్ స్టా ర్ హీరోయిన్‌గా మారిపోయిన కథానాయికలెందరో. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్లు తర్వాత అవకాశాలు లేకనో, అవకాశాలు వచ్చినా పెద్దగా పేరు తెచ్చేవి కాకపోవటం వల్లనో మళ్లీ మామూలు స్థాయికి చేరుకున్న సందర్భాలూ అనేకం. అలా ఇప్పటివరకు మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోలేని హీరోయిన్లలో శ్రీనిధి శెట్టి ఒకరు.

‘కేజీఎఫ్’ లాంటి  భారీ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన శ్రీనిధి.. అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ‘కేజీఎఫ్’ తర్వాత ఈ చిన్నదాని లక్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుందని, స్టార్ హీరోయిన్ల జాబి తాలో శ్రీనిధి శెట్టి పేరూ చేరిపోతుందని అందరూ భావించారు. కానీ, అమ్మడి విషయంలో మాత్రం అంచనాలు తారుమారయ్యాయి. ‘కేజీఎఫ్’ తర్వాత స్టార్ హీరోల సరసన ఛాన్స్ వ చ్చినా, హిట్లు మాత్రం అందుకోలేకపోయిందీ సొగసరి.

ఇదిలా ఉండగా.. శ్రీనిధి తాజాగా ‘తెలుసు కదా’ సినిమాలో నటిస్తున్నది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్ నుంచి డైరెక్టర్ గా మారిన నీరజ.. తన మొద టి సినిమానే సిద్దు జొన్నలగడ్డతో చేస్తున్నారు. ఈ సినిమాలో సిద్దు సరసన రాశీ ఖన్నా, శ్రీని ధి శెట్టి నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్ గా నిర్మిస్తున్న ‘తెలుసు కదా’ రెగ్యుల ర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లలో ప్రారంభమైంది.

మొదటి షెడ్యూల్లో సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నాలపై టాకీతో పాటు సాంగ్ ను షూట్ చేశారు. తాజాగా కొత్త షెడ్యూల్ ప్రారంభమయ్యింది. ఈ కొత్త షెడ్యూల్‌లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి జాయిన్ అయ్యింది. ఈ షెడ్యూల్‌లో చాలా కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. శ్రీనిధి శెట్టికి ఈ సినిమా విజయం చాలా అవసరం. మరి ఈసారైనా హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.